లేపాక్షికి రానున్న మోదీ
సత్య సాయి జిల్లాలో పర్యటన
అమరావతి – ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాలో పీఎం వివిధ పనులను ప్రారంభిస్తారు. రూ. 541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్ , పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడెమీని ఏర్పాటు చేయనున్నారు.
503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం ప్రధాన మంత్రి నేరుగా దేశంలో పేరు పొందిన లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్నారు.
ఇదిలా ఉండగా జనవరి 22న దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం శ్రీరాముడి పునః ప్రతిష్ట కార్యక్రమంలో నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఇప్పటికే విస్తృతంగా కేంద్ర సర్కార్ ఆధ్వర్యంలోని యూపీ సర్కార్ ఏర్పాట్లు చేసింది.
ఇదే సమయంలో దేశంలోని అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను పరిశుభ్రం చేయాలని ప్రధాన మంత్రి మోదీ పిలుపునిచ్చారు. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో రాముడి ప్రారంభోత్సవం జరిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.