లోకేష్ పిలుపు వైసీపీలో కుదుపు
టీడీపీలో చేరిన 100 కుటుంబాలు
మంగళగిరి – ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగుతోంది రాజకీయం. ఈ తరుణంలో టీడీపీ దూసుకు పోతోంది. ప్రధానంగా ఏపీలో చోటు చేసుకున్న పాలనపై ఫోకస్ పెట్టింది. యువ గళం పాదయాత్రతో ప్రజల్లో చైతన్యం తీసుకు రావడంలో నారా లోకేష్ సక్సెస్ అయ్యారు. ఇదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
తాజాగా టీడీపీలో చేరాలని, మంచి భవిష్యత్తు ఉంటుందని పిలుపునిచ్చారు నారా లోకేష్. ఆయన ఇచ్చిన పిలుపునకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ప్రధానంగా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పసుపు తీర్థం పుచ్చుకుంటున్నారు.
తాజాగా వైసీపీకి చెందిన కీలక నేతలు అందె వెంకట ప్రసాద్, పల్నాటి నాగేశ్వర్ రావు తో పాటు మరో 100 కుటుంబాలు నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగించారు. రాష్ట్రంలో వైసీపీ ఖాళీ కావడం ఖాయమన్నారు. దారుణమైన, రాక్షస పాలన సాగిస్తున్న జగన్ కు ప్రజలు బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని జోష్యం చెప్పారు.
మంగళగిరి నియోజకవర్గ అభివృద్ది కోసం కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు నారా లోకేష్. టీడీపీలో అన్ని వర్గాలకు సముచిత స్థానం తప్పక ఉంటుందని స్పష్టం చేశారు.