లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలి
పిలుపునిచ్చిన మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్ – అనారోగ్యం నుంచి కోలుకున్న బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కీలక నేతలు పాల్గొన్నారు. కేసీఆర్ తో పాటు కేశవరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేసీఆర్ ప్రసంగించారు. ఓటమి పాలైనందుకు బాధ పడాల్సిన అవసరం లేదన్నారు.
ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని, అపజయం గురించి ఆలోచించ వద్దని కోరారు. రాబోయే ఎన్నికలు మనందరికీ అత్యంత సవాల్ తో కూడుకున్నాయని గుర్తించాలన్నారు కేసీఆర్. ఈ సందర్భంగా ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.
ప్రస్తుతం కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలతో పవర్ లోకి వచ్చిందని, దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ స్థానాలలో గెలుపొందాలని, క్లీన్ స్వీప్ చేయాలని స్పష్టం చేశారు. తాను కూడా కోలుకున్నానని, త్వరలోనే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో తాను పర్యటిస్తానని ప్రకటించారు.