వర్గీకరణ జరిగే దాకా జాబ్స్ వద్దు
ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ
హైదరాబాద్ – మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చీఫ్ మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నియమించబోయే ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల పెంపు జరిగేంత వరకు ఉద్యోగ నియామకాల ప్రక్రియను నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.
జాబ్స్ భర్తీలో తీవ్రమైన అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఉన్నత వర్గాలకే న్యాయం జరిగిందని ఆరోపించారు. దీని వల్ల అధికారం మొత్తం అగ్ర కులాలకే చెందుతోందని దీని వల్ల బహుజనులు దూరమై పోతున్నారని మండిపడ్డారు.
ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా, రిజర్వేషన్ పెంపుపై మార్గదర్శక సూత్రాలను వెంటనే ఇవ్వాలని కోరారు మందకృష్ణ మాదిగ. తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుందన్నారు. కానీ రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు మందకృష్ణ మాదిగ.