ANDHRA PRADESHNEWS

విద్యా రంగంపై ఏపీ స‌ర్కార్ నిర్ల‌క్ష్యం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి – ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన కూట‌మి ప్ర‌భుత్వం విద్యా రంగాన్ని ప‌ట్టించు కోవ‌డం లేద‌ని ఆరోపించారు. ఈ మూడు నెల‌ల కాలంలో విద్యా వ్య‌వ‌స్థ‌ల‌న్నీ కుంటు ప‌డ్డాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

ప్రభుత్వ విద్యా సంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రతిపక్షపార్టీపై బురద జల్లడ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని మండిప‌డ్డారు.

రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమల్లో ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం అంతా మునిగి పోయి పాలనను గాలికి వ‌దిలి వేశారంటూ ఫైర్ అయ్యారు జ‌గ‌న్ రెడ్డి నూజివీడు ట్రిపుల్‌ ఐటీ సహా గవర్నమెంటు రెసిడెన్షియల్‌ స్కూళ్లలో కలుషితాహారం కారణంగా వందల మంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా ప‌ట్టించు కోవ‌డం లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు మాజీ సీఎం.

ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వ స్పందన అత్యంత దారుణంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కొడుకే విద్యా శాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగ లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని జ‌గ‌న్ రెడ్డి ఆరోపించారు.

మరోవైపు గుడ్లవల్లేరు ప్రయివేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో హిడెన్‌ కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని పేర్కొన్నారు.