విద్వేష రాజకీయాలు ప్రమాదం
పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ
పశ్చిమ బెంగాల్ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో విద్వేష రాజకీయాలకు తెర తీసింది బీజేపీనంటూ మండిపడ్డారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్బంగా గురువారం పశ్చిమ బెంగాల్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
గతంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగి పోయిందన్నారు. అయినా మోదీ స్పందించక పోవడం దారుణమన్నారు. ఏడాదికి 2 కోట్ల జాబ్స్ ఇస్తామన్నారని, కానీ ఇప్పటి దాకా ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు.
ఈ దేశంలో ప్రధాన వనరులన్నీ బడా వ్యాపారవేత్తలకు కేటాయిస్తూ వెళుతున్నారని , ఇక మిగిలింది ప్రజలకు ఏమీ ఉండదన్నారు. ప్రస్తుతం జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు ఈ వాస్తవాలను గ్రహించాలని, లేక పోతే భవిష్యత్తు ఉండదన్నారు.
కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హెచ్చరించారు. ఇతర మైనార్టీ వర్గాలు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.