విప్రో చైర్మన్ తో రేవంత్ భేటీ
ఫలవంతంగా ముగిసిన చర్చలు
దావోస్ – తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు గాను ఆయన దావోస్ కు వెళ్లారు. అక్కడ మూడు రోజుల పాటు పర్యటించారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి సంబంధించి భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఇందులో భాగంగా సీఎం వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు కార్యదర్శి జయేష్ రంజన్ కూడా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన కంపెనీల ప్రతినిధులు, సిఇవోలు, ఎండీలు, చైర్మన్లతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా దేశంలో పేరు పొందిన ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సీఎం రేవంత్ రెడ్డితో గంటకు పైగా సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా నాలుగు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
రాష్ట్రంలో రూ.12,400 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు స్పష్టం చేశారు గౌతమ్ అదానీ. పవర్, డేటా సెంటర్ ల ఏర్పాటుపై ఖర్చు చేయనున్నారు. తాజాగా ఐటీ రంగంలో కీలక కంపెనీగా ఉన్న విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్ జీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.
విప్రో ఐటీ కంపెనీని వరంగల్ కు విస్తరించడం, తెలంగాణ లో కొత్త వినియోగదారుల సంరక్షణ తయారీ యూనిట్లను స్థాపించడం, నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించడం వంటి అవకాశాల గురించి చర్చించారు. వీరితో పాటు చర్చల్లో పాలు పంచుకున్నారు శ్రీధర్ బాబు, జయేష్ రంజన్.