వైసీపీ కంటే జనసేన బెటర్
క్రికెటర్ అంబటి రాయుడు
మంగళగిరి – ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు. ఒక స్థిరమైన అభిప్రాయంతో ఇప్పటి వరకు ఉండక పోవడం కొంత విమర్శలకు దారితీసేలా చేసింది. తాను క్రికెట్ నుండి రిటైర్మెంట్ అవుతున్నట్లు ప్రకటించాడు. ఆ తర్వాత తాను విరమించు కుంటున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం లీగ్ పోటీలలో ఆడుతున్నాడు.
ఇది పక్కన పెడితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాడు. ఆయన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. వైసీపీ కండువా కప్పుకున్నారు. తీరా పట్టుమని 10 రోజులు కూడా అక్కడ ఉండలేక పోయారు.
ఆ వెంటనే జగన్ కు , పార్టీకి గుడ్ బై చెప్పారు. మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లారు. సుదీర్ఘ భేటీ అనంతరం తన భావజాలం, పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఒక్కటేనని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా తనకు పవన్ కళ్యాణ్ వెండితో తయారు చేసిన వినాయకుడి ప్రతిమను అందజేశారు.
మీడియాతో మాట్లాడిన అంబటి రాయుడు సంచలన కామెంట్స్ చేశారు. నా భావజాలానికి వైసీపీ సరిపోదన్నారు. ఇప్పటికీ క్రికెట్ మీదనే ఫోకస్ పెడతానని చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. వైసీపీలో ఉంటే తన కల నెరవేరదని ఇక్కడికి వచ్చానని అన్నారు.