వైసీపీ మూడో జాబితా విడుదల
ప్రకటించిన సీఎం జగన్ రెడ్డి
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువు తీరిన వైసీపీ సర్కార్ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ బాస్, సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సర్వేలు, పనితీరు ఆధారంగా ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ తరపున అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు.
శాసన సభకు సంబంధించి మొత్తం 175 స్థానాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తాజాగా మూడో విడతను ప్రకటించారు సీఎం. ఇందులో ఎంపీ సీట్లకు గాను 21 మందిని ఖరారు చేశారు.
సూళ్లూరుపేట ఎంపీ స్థానానికి గురుమూర్తిని ఎంపిక చేశారు. అనూహ్యంగా ఆయనకు తిరుపతి నుంచి టికెట్ రాలేదు. ఇక పెడన నియోజకవర్గానికి ఉప్పల రాము, చిత్తూరు లోక్ సభ స్థానానికి విజయానంద రెడ్డి, మార్కాపురంకు జంకె వెంకట్ రెడ్డి, రాయ దుర్గం లోక్ సభకు మెట్టు గోవింద్ రెడ్డిని ఎంపిక చేశారు.
ఇక పూతలపట్టు నియోజకవర్గానికి డాక్టర్ సునీల్, శ్రీకాకుళం స్థానానికి పేరాడ తిలక్, ఏలూరు స్థానానికి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ , విజయవాడ ఎంపీ స్థానానికి తాజాగా పార్టీలో చేరిన కేశినేని నాని, కర్నూలు లోక్ సభకు గుమ్మనూరు జయరాంకు టికెట్ కేటాయించారు.
తిరుపతి ఎంపీకి స్థాన చలనం జరిగింది. ఆయన స్థానంలో సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలంకు కేటాయించారు జగన్ మోహన్ రెడ్డి, ఇచ్చాపురంకు పిరియా విజయ, టెక్కలికి దువ్వాడ శ్రీనివాస్ , చింతలపూడి నియోజకవర్గానికి విజయ రామ రాజు, దర్శి లోక్ సభ స్థానానికి బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిని ఖరారు చేశారు.
మదనపల్లె లోక్ సభ స్థానానికి నిస్సార్ అహ్మద్, రాజంపేటకు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆలూరుకు విరూపాక్షి, కోడుమూరు నియోజకవర్గానికి డాక్టర్ సతీష్ , గూడూరుకు మేరిగ మురళీధర్ , సత్యవేడు లోక్ సభ స్థానానికి డాక్టర్ గురుమూర్తిని ఎంపిక చేశారు సీఎం.