వ్యవసాయం తెలంగాణకు ఆధారం
నేను రైతు బిడ్డనన్న రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దావోస్ లో ఆయన మూడు రోజుల పాటు పర్యటించారు. అనంతరం లండన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రముఖులతో సీఎం భేటీ అయ్యారు. ప్రపంచానికి ఆహార ధాన్యాలు అత్యంత అవసరమని స్పష్టం చేశారు. టెక్నాలజీతో పాటు ఫుడ్ కూడా ముఖ్యమేనని పేర్కొన్నారు.
దావోస్ వేదికపై రైతు భరోసా పథకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను రైతు బిడ్డనని, వ్యవసాయం అన్నదిద తమ సంస్కృతి అని స్పష్టం చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి. ఫుడ్ సిస్టమ్ లోకల్ యాక్షన్ అనే అంశంపై జరిగిన కాన్ఫరెన్స్ లో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
భారత దేశంలో కొలువు తీరిన మోదీ, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిందని దీని వల్లనే రైతులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారని గుర్తు చేశారు. కానీ తాము తెలంగాణలో కొలువు తీరాక రైతులకు మేలు చేకూర్చేలా చర్యలు చేపట్టామని చెప్పారు రేవంత్ రెడ్డి.
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తాము రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు.