శాంసన్ కు బీసీసీఐ ఛాన్స్
ఆఫ్గాన్ టూర్ కు ఎంపిక
ముంబై – కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ కు ఛాన్స్ దక్కింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆఫ్గనిస్తాన్ లో ఈనెలలో జరిగే టీ20 సీరీస్ కు గాను జట్టును ప్రకటించింది. అనూహ్యంగా హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ లను పక్కన పెట్టింది. గాయం కారణంగా వీరిద్దరిని ఎంపిక చేయలేదని వెల్లడించింది.
ఇక తాజాగా జరిగిన దక్షిణాఫ్రికా టూర్ లో సంజూ శాంసన్ అద్భుతమైన పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో బీసీసీఐ సంజూను ఎంపిక చేయాల్సి వచ్చింది. తాజా టూర్ కు ఎంపిక చేయడంతో శాంసన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇదిలా ఉండగా అయ్యర్, ఇషాన్ కిషన్ ను పక్కన పెట్టేసింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. ఇక ఎంపిక చేసిన టీమ్ లో జైస్వాల్ , గిల్ , కోహ్లీ, వర్మ, రింకూ, జితేష్ శర్మ, సంజూ శాంసన్ , రోహిత్ శర్మ, శివమ్ దూబే, సుందర్ , అక్షర్ పటేల్ , రవి , కులదీప్ యాదవ్ , అవేష్ ఖాన్, అర్ష్ దీప్ ఉన్నారు.
ఆఫ్గనిస్తాన్ ఇండియాలో ఆడుతుంది. 11న తొలి మ్యాచ్ మొహాలీలో, 2వ టీ20 మ్యాచ్ 14న ఇండోర్ లో , 3వ మ్యాచ్ 17న బెంగళూరులో జరుగుతుంది.