శ్రీనివాసుడికి పీఠాధిపతి పూజలు
వేంకటేశ్వర స్వామికి ప్రార్థనలు
తిరుమల – శ్రీ రంగం శ్రీమఠం ఆండవన్ ఆశ్రమం ప్రధాన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ వరాహ మహాదేశికన్ (ఆండవన్ ) శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రార్థనలు చేశారు.
ఆలయ సాంప్రదాయ మర్యాద (పెద్ద మర్యాద) ప్రకారం పాత అన్న ప్రసాదం కాంప్లెక్స్ సమీపంలో ఉన్న పవిత్ర అత్తి చెట్టు వద్ద ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం టీటీడీ జేఈవో వీరబ్రహ్మం స్వామి వారికి స్వాగతం పలకగా, అర్చకులు ఇస్తిక పాలతో బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకెళ్లారు.
డివైఇవో లోకనాధం, ఆలయ పీష్కార్ శ్రీహరి, పర్పతేయాదార్ తులసీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.