శ్రీరాముడి జపం చేస్తే ఓట్లు రావు
నిప్పులు చెరిగిన సీఎం ఎంకే స్టాలిన్
తమిళనాడు – ఎవరి విశ్వాసాలు వారికి ఉంటాయని, శ్రీరాముడి పేరుతో , అయోధ్య రామాలయ నిర్మాణం పేరుతో రాజకీయాలు చేస్తే ఓట్లు రాలవన్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ దేశం సెక్యులరిజం కోరుకుంటుందన్నారు. మత వాదంతో కూడిన అవకాశ వాద రాజకీయాలను కాదన్నారు.
తాము ఎవరికీ వ్యతిరేకం కాదని కానీ ఇంకొకరిని కించ పర్చడాన్ని తాము ఒప్పుకోమన్నారు. రామ మందిరం లాంటి అంశాల తల్ల తమిళులు బీజేపీకి ఓట్లు వేస్తారని అనుకోవడం భ్రమనేనని పేర్కొన్నారు సీఎం. తిరుక్కురల్ పఠించడం, పొంగల్ జరుపు కోవడం, అయోధ్యలో శ్రీరాముడి నిర్మాణం తమకు లాభం చేకూరుస్తుందని వాళ్లు భావిస్తున్నారని అది పూర్తిగా తప్పు అని స్పష్టం చేశారు.
త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాల కూటమి ఇండియా పలు సీట్లలో జయకేతనం ఎగుర వేస్తుందని చెప్పారు ఎంకే స్టాలిన్. గత ఎన్నికల్లో కాషాయాన్ని పట్టించు కోలేదన్నారు. ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలో జరిగిన డీఎంకే యువజన విభాగం 2వ రాష్ట్ర స్థాయి సదస్సులో స్టాలిన్ ప్రసంగించారు.
మోడీ రెండుసార్లు పీఎంగా ఉన్నారని కానీ ఆయనను ఆదరించారని కానీ ఓట్లు వేయలేదన్నారు. తమ ప్రాంతానికి ఎవరు వచ్చినా గౌరవం ఇస్తారని స్పష్టం చేశారు. ఇది సంప్రదాయమన్నారు. కానీ తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే ఎవరూ ఒప్పుకోరని పేర్కొన్నారు.