శ్రీరాముడు ఆదర్శ ప్రాయుడు
నేటి నుంచి ఈ పదం ప్రపంచం
ముంబై – ఈ దేశంలో అత్యున్నతమైన పదం ఏదైనా ఉందంటే అది శ్రీరాముడి పదం మాత్రమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా. ఆయన సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటారు. స్పూర్తి దాయకమైన కథలు, వ్యక్తులు, సూక్తుల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. ఇందు కోసం ప్రపంచ వ్యాప్తంగా తనకు నచ్చిన ప్రతి అంశం గురించి కోట్ చేస్తారు.
తాజాగా ట్విట్టర్ వేదికగా ఆయన ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. అదేమిటంటే భారత దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మగా అభివర్ణించిన అయోధ్యలో కొలువు తీరిన రామాలయం. శ్రీరాముడు అందరి వాడు. ఏ ఒక్కరికో లేదా ఏ ఒక్క మతానికో చెందిన మానవుడు కాదని పేర్కొన్నారు. దైవ స్వరూపం కలిగిన శ్రీరాముడి గురించి ఎంత చెప్పినా తక్కువేనని స్పష్టం చేశారు ఆనంద్ మహీంద్రా.
కోట్లాది మంది ప్రజలకే కాదు ఈ ప్రపంచానికి ఆదర్శ ప్రాయమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతడు శ్రీరాముడు మాత్రమేనని పేర్కొన్నారు వ్యాపారవేత్త. శ్రీరాముడు ఏ చట్రంలో ఇముడని మహోన్నత మానవుడు అంటూ కొనియాడారు ఆనంద్ మహీంద్రా. అతడు విడిచిన బాణాలు చెడును, అన్యాయంపై ఎక్కు పెట్టాయి. రామ రాజ్యం ..ఆదర్శ వంతమైన పాలన ఇదే ఆయన నుంచి నేర్చుకోవాల్సిందని పేర్కొన్నారు.