శ్రీరామ కీర్తనకు మోదీ ఫిదా
గాయని భార్గవి వెంకటరామ్
తమిళనాడు – దేశ వ్యాప్తంగా శ్రీరామ నామ సంకీర్తనలతో మారు మ్రోగుతోంది. కానీ ఒకే ఒక్క గొంతు మాత్రం కోట్లాది మందిని విస్తు పోయేలా చేసింది. ఆమె పాడిన రామ కీర్తన ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఆమె ఎవరో కాదు తమిళనాడుకు చెందిన భార్గవి వెంకట రామ్. తాజాగా అయోధ్య లోని రామాలయం లో శ్రీరాముడి పునః ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. దీనిని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించారు. దేశానికి చెందిన 7000 మంది ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, సినీ నటులు ఉన్నారు.
ఈ సందర్బంగా భార్గవి తన్మయత్వంతో పాడిన సంకీర్తన తనను మైమరిచి పోయేలా చేసిందన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆమె పాడిన ఆల్బమ్ ను తన స్వంత ట్విట్టర్ లో షేర్ చేశారు పీఎం. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఎవరీ భార్గవి వెంకట్రామ్ అని జనం వెతుకుతున్నారు. గూగుల్ లో శోధిస్తున్నారు. ఎంతైనా అదృష్టం అన్నది తలుపు తడితే ఎవరూ ఏమీ చేయలేరనేది తేలి పోతుంది.