షర్మిలకు గ్రాండ్ వెల్ కమ్
ఎన్నికల పర్యటనకు శ్రీకారం
అమరావతి – ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం లభించింది. ఆమె విశాఖపట్టణంకు చేరుకున్నారు. పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఇదిలా ఉండగా ఈనెల 23 నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం లో తొలి ఎన్నికల సభకు శ్రీకారం చుట్టనున్నారు షర్మిల.
జనవరి 31తో కడప జిల్లా ఇడుపులపాయ లో సభతో పూర్తవుతుంది. ఈ విషయాన్ని ఏపీసీసీ ప్రకటించింది. ఇదిలా ఉండగా వైఎస్ షర్మిల ఏపీ సీఎం, తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డిని, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకున్నారు. మాటల తూటాలు పేల్చుతున్నారు.
ఆమె చేసిన దారుణమైన కామెంట్స్ తమకు డ్యామేజ్ చేసేలా ఉన్నాయని గ్రహించింది వైసీపీ. ఈ మేరకు ఆ పార్టీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆయనతో పాటు పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం భగ్గుమన్నారు.
కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబానికి చేసిన ద్రోహం గురించి మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. స్థాయి మరిచి మాట్లాడటం మంచి పద్దతి కాదని సూచించారు.