షా వల్లి దర్గా సన్నిధిలో ఎమ్మెల్యే
దర్శించుకున్న ఎంపీ అభ్యర్థి మల్లురవి
నాగర్ కర్నూల్ జిల్లా – ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మల్లు రవి నాగర్ కర్నూల్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలో పేరు పొందిన ఆలయాలను సందర్శించారు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి దర్శించుకున్నారు.
ముందుగా మల్లు రవి , ఎమ్మెల్యే వంశీ కృష్ణ చారకొండ మండలంలో ప్రసిద్ది చెందిన సీతారామ ఆంజనేయ దేవాలయాన్ని సందర్శించారు. ప్రత్యేకంగా పూజలు చేశారు. పూజారులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం రంగాపూర్ గ్రామానికి సమీపాన నల్లమల్ల అడవిలో కొలువు తీరిన ఉమా మహేశ్వరం ఆలయాన్ని సందర్శించారు.
ఈ సందర్బంగా మల్లు రవి, వంశీకృష్ణకు ఆలయ కమిటీ సాదర స్వాగతం పలికింది. ఆలయంలో ఇద్దరూ కలిసి పూజలు చేశారు. అనంతరం అత్యంత పేరు పొందిన గ్రామంలోని హజ్రత్ సయ్యద్ నిరంజన్ షా వలి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చాదర్ సమర్పించారు.
సందర్శించిన అనంతరం మల్లు రవి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఆలయాల అభివృద్దికి కృషి చేస్తానని తెలిపారు. దర్గా ప్రార్థనా స్థలానికి మౌలిక సదుపాయలు కల్పించేలా చూస్తానని పేర్కొన్నారు.