సంక్రాంతి వేడుకల్లో మోదీ
ఆవులకు పశుగ్రాసం
న్యూఢిల్లీ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏది చేసినా సంచలనమే. ఆదివారం దేశ వ్యాప్తంగా మకర సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా తమిళ సంఘం ఆధ్వర్యంలో మోదీ పాల్గొన్నారు. భోగిని జరుపుకున్నారు. ప్రధాన మంత్రి పూజలు చేశారు.
ఇదే సమయంలో తనకు ఆలయాలు, గోపురాలు, ప్రార్థనా మందిరాలు అంటే వల్లమాలిన అభిమానం మోదీకి. మోదీ వైరల్ గా మారారు. కారణం ఆవులు, దూడలను చేరదీశారు. వాటికి గ్రాసాన్ని అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఈనెల 22న అయోధ్యలో రాముడి విగ్రహం పునః ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆహ్వానం పంపించింది అయోధ్య రామ మందిరం ట్రస్టు సభ్యులు పంపించారు. కానీ తాము వెళ్లబోమంటూ స్పష్టం చేసింది ఏఐసీసీ.
ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం కాదని కేవలం రాజకీయ ప్రయోజనాల దృష్టితో శ్రీకారం చుట్టారని ఆరోపించింది.