సఫారీల దెబ్బకు ఆఫ్గాన్ విలవిల
56 రన్స్ కే చాప చుట్టేసిన వైనం
ట్రినిడాడ్ – టి20 వరల్డ్ కప్ లో సంచలనాలకు తెర తీసి..ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించిన ఆఫ్గనిస్తాన్ కథ ముగిసింది. కీలకమైన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓటమి పాలైంది. ఏ కోశాన పోరాటం చేయలేక చతికిల పడింది. దీంతో ప్రత్యర్థి చేతిలో 56 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. దీంతో తొలిసారి ఫైనల్ కు చేరుకున్నారు సఫారీలు.
వీరి దెబ్బకు ఆఫ్గనిస్తాన్ విల విల లాడింది. జాంసన్ , షంసీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. కళ్లు చెదిరే బంతులతో నిప్పులు చెరిగారు. దీంతో ఆప్గనిస్తాన్ బ్యాటర్లు పరుగులు తీసేందుకు నానా తంటాలు పడ్డారు.
తొలి ఓవర్ నుంచే ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. కేవలం 11 ఓవర్లలోనే ఆఫ్గన్ పెవిలియన్ బాట పట్టింది.ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్సెన్ , షంసీ మూడు వికెట్లు తీస్తే రబాడా 2, నోకియా 2 చొప్పున పడగొట్టారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్గన్ 56 రన్స్ చేసింది. అనంరతం స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది ప్రత్యర్థి దక్షిణాఫ్రికా టీమ్.