సాథ్వి..ఉమా భారతి హల్ చల్
అయోధ్యలో ఆ ఇద్దరు సందడి
అయోధ్య – ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ భరితంగా ఎదురు చూసిన అయోధ్య రామ మందిరం పునః ప్రతిష్ట కార్యక్రమం ఎట్టకేలకు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ముగిసింది. ఈ సందర్బంగా దేశంలోని క్రీడా, సినీ, రాజకీయ, వ్యాపార, వాణిజ్య, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. శ్రీరామ జన్మ భూమి ట్రస్టు 7,000 మందికి పైగా ఆహ్వానించింది. ఇదే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీజీ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది.
ఇదిలా ఉండగా ఎన్నో ఏళ్ల పాటు రామ జన్మ భూమి వివాదం కొనసాగుతూ వచ్చింది. గత ఏడాది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. అయోధ్యలోని స్థలం రాముడిదేనంటూ సంచలన తీర్పు చెప్పింది. దీంతో ముహూర్తానికి ఖరారు చేశారు ప్రధాన మంత్రి మోదీ.
ఆయనతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొన్నారు. రామ జన్మ భూమి కోసం ఎందరో ప్రాణాలు అర్పించారు. ఇదే సమయంలో కీలక పాత్ర పోషించారు ఇద్దరు మహిళలు. వారెవరో కాదు ఒకరు సాథ్వితంబర మరొకరు ఉమా భారతి. ఆ ఇద్దరూ అయోధ్యలో కనిపించారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.