సానియా షాక్ షోయబ్ ఖుష్
అర్ధాంతంగా వదిలేసిన క్రికెటర్
హైదరాబాద్ – ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ టెన్నిస్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన సానియా మీర్జాకు కోలుకోలేని షాక్ తగిలింది. 2010లో పాకిస్తాన్ కు చెందిన క్రికెటర్ షోయబ్ మాలిక్ తో పెళ్లి జరిగింది. ఇద్దరూ కొంత కాలం డేటింగ్ లో ఉన్నారు. ఒకరు భారత్ కు చెందిన సానియా ఇంకొకరు ఇండియాతో నిత్యం గిల్లికజ్జాలు పెట్టుకునే శత్రు దేశంగా భావించే పాకిస్తాన్ కు చెందిన క్రికెటర్.
వీరిద్దరూ కలిసి పోవడాన్ని, పెళ్లి చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. తామిద్దరం క్రీడా రంగానికి చెందిన వాళ్లమని, తమ ప్రేమకు, వివాహానికి మతం, దేశం ఎందుకు అడ్డు పడుతుందని పేర్కొన్నారు కొందరు. ఇదంతా పక్కన పెడితే సానియా మీర్జా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి.
ఆమె తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు చెందిన వ్యక్తి. సానియా చెల్లెల్ని ప్రముఖ భారతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ తనయుడును చేసుకుంది. టెన్నిస్, క్రికెట్ కుటుంబాలు ఒక్కటయ్యాయి.
13 ఏళ్ల బంధానికి తెర పడడంతో సానియా మీర్జాకు షాక్ తగిలింది. ఈ ఇద్దరికి ఒక కొడుకు పుట్టాడు. షోయబ్ మాలిక్ నటితో పెళ్లి చేసుకుని తల్లీ, బిడ్డను వదిలేశాడు.