NEWSTELANGANA

సారుకు ఘ‌న స‌న్మానం

Share it with your family & friends

ఆచార్యుడికి అభినంద‌న

హైద‌రాబాద్ – తెలంగాణ ఉద్య‌మ జ‌ర్న‌లిస్టుల సంఘం ఆధ్వ‌ర్యంలో గ‌వ‌ర్న‌ర్ కోటా కింద శాస‌న మండ‌లి స‌భ్యులుగా నియ‌మితులైన ప్రొఫెస‌ర్ కోదండ‌రాం తో పాటు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు మీర్ అమీర్ అలీ ఖాన్ ల‌ను ఘ‌నంగా స‌న్మానించారు. తెలంగాణ ఏర్పాటైన స‌మ‌యంలో ఎంతటి అనుభూతి చెందామో అదే సంతోషం ఇప్పుడు క‌లిగింద‌ని పేర్కొన్నారు పాత్రికేయులు.

ఈ సందర్భంగా సామాన్య శాస్తం కానుకగా ఉద్యమ ఖిల్లాగా, అమ్మ చెట్టు వంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఛాయా చిత్రాన్ని జన సమితి కార్యాలయంలో విద్యావేత్త అయిన‌ కోదండరాంకు అంద‌జేశారు. ఉస్మానియా విశ్వ విద్యాలయంతో విడ దీయరాని అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే.

ఇది ఒక రకంగా విద్యార్థులు, నిరుద్యోగులు, అమరుల ఆశయాలను గుర్తు చేసేందుకే అనడంతో ఆయన ఉద్వేగానికి గురయ్యారు. ఆ బాధ్యతను ఎల్లవేల్లలా గుర్తుచేసే ఈ చిత్రం విలువైన కానుక అంటూ దాన్ని వారు స్వీకరించారు.

సియాసత్ న్యూస్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ ను స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ ఉద్య‌మ జ‌ర్న‌లిస్టుల సంఘం కన్వీనర్ రెహమాన్, సీనియర్ పాత్రికేయులు, ఉద్యమ కారులు మునీర్ భాయ్ తో పాటు ఫజల్ రెహమాన్, యాటకర్ల మల్లేష్, సుమ బాల, పసునూరి రవీందర్, సాదిక్, అనిల్ పాల్గొన్నారు.