సిఈవో డాల్ఫ్ వాన్ డెన్ తో సీఎం భేటీ
ముగిసిన ఫలవంతమైన చర్చలు
దావోస్ – సీఎం రేవంత్ రెడ్డి చర్చనీయాంశంగా మారారు. ప్రపంచ ఆర్థిక సదస్సు లో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు బిజీగా గడిపారు. ఈ సందర్బంగా పలు కంపెనీల ప్రతినిధులతో ములాఖత్ అయ్యారు. రాష్ట్రం తీసుకున్న చర్యల గురించి స్పష్టం చేశారు.
ప్రధానంగా తమ రాష్ట్రం పెట్టుబడులకు ఎంత అనుకూలంగా ఉంటుందో వివరించారు. ఆయన వెంట మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ కూడా ఉన్నారు. ఇప్పటికే ప్రముఖ భారతీయ కంపెనీ అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీతో గంటకు పైగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇందులో భాగంగా ఏకంగా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు అదానీ. తెలంగాణలో రూ. 12,400 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. ఇది దశల వారీగా కొనసాగుతుందని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం నాలుగు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
అనంతరం రేవంత్ రెడ్డి విప్రో చైర్మన్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా వరంగల్ లో విప్రో ఏర్పాటు చేసేలా చూడాలని కోరారు. ఇదే సమయంలో హైనెకెన్ ఇంటర్నేషనల్ సిఇఓ డాల్ఫ్ వాన్ డెన్ బ్రింక్ తో సమావేశం అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. చర్చలు ఫలప్రదంగా ముగిశాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.