సినిమా సక్సెస్ బయ్యర్స్ సేఫ్
గుంటూరు కారం నిర్మాత నాగ వంశీ
హైదరాబాద్ – ప్రముఖ సినీ నిర్మాత నాగ వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దిగ్గజ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు, లవ్లీ గర్ల్ శ్రీలీల , మీనాక్షి చౌదరి కలిసి నటించిన గుంటూరు కారం చిత్రం విడుదలైంది. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12న రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
విడుదలైన వెంటనే పెద్ద ఎత్తున నెగటివ్ ప్రచారం జరిగింది. సినిమా ఎత్తి పోయిందని, వసూళ్లు రాలేదని, చాలా థియేటర్లలో సినిమాను ఎత్తి వేశారంటూ సినీ వర్గాలలో జోరందుకుంది. దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు నిర్మాత నాగ వంశీ.
శుక్రవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఊహించని రీతిలో గుంటూరు కారం విజయం సాధించిందన్నారు. ఇప్పటికే పెట్టిన పెట్టుబడి పూర్తిగా వచ్చేసిందన్నారు. బయ్యర్స్ , డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ సైడ్ అయ్యారంటూ తెలిపారు నాగ వంశీ.
కొందరు కావాలని గుంటూరు కారం బాగోలేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసినా వారు చేసిన ప్రయత్నం వర్కవుట్ కాలేదన్నారు. ఈ సినిమా సక్సెస్ వెనుక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారని అన్నారు. ఇక తెరపై అద్బుతంగా నటించాడంటూ మహేష్ బాబు ను కొనియాడారు.