సీఎంతో టాటా సన్స్ చైర్మన్ భేటీ
కీలక అంశాలపై రేవంత్ తో చర్చలు
దావోస్ – సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని బృందం దావోస్ టూర్ ముగిసింది. అన్ని చర్చలు ఫలప్రదం అయ్యాయని ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మూడు రోజుల పాటు పర్యటించారు. గురువారం నేరుగా అక్కడి నుంచి లండన్ కు బయలు దేరి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కార్యదర్శి జయేష్ రంజన్ ఉన్నారు.
ఈ సందర్బంగా సుమారు 70 మందికి పైగా ప్రతినిధులతో సమావేశం అయ్యారు సీఎం. అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ, గోడ్రెజ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ గోడ్రెజ్ తో పాటు ఇతర కంపెనీల ప్రతినిధులు భేటీ అయ్యారు.
ఇక ఐటీ రంగానికి వస్తే విప్రో కంపెనీ చైర్మన్ రషీద్ ప్రేమ్ జీ తో పాటు ప్రముఖ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మర్యాద పూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డితో కలుసుకున్నారు. ఈ సందర్బంగా వీరిద్దరి మధ్య గంటకు పైగా చర్చలు జరిగాయి. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఓ జ్ఞాపికను చంద్రశేఖరన్ కు అందజేశారు సీఎం.
మరో వైపు వరంగల్ కేంద్రంగా ఐటీని విస్తరించనున్నట్లు స్పష్టం చేశారు విప్రో చైర్మన్.