సీఎంతో సీడబ్ల్యూఈఐసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ భేటీ
వ్యూహాత్మక భాగస్వామి అయ్యేందుకు ఉత్సుకత
హైదరాబాద్ – కామన్వెల్త్ ఎంటర్‌ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోసీ గ్లేజ్‌బ్రూక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. శుక్రవారం సచివాలయంలో సీఎంతో వివిధ అంశాలపై చర్చించారు.
ఈ సందర్బంగా ఆమె కౌన్సిల్ కార్యకలాపాల గురించి చర్చించారు రోసీ గ్లేజ్ బ్రూక్. కామన్వెల్త్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించడంపై దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రత్యేకించి చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (SMES) , స్టార్టప్‌లను స్కేల్ చేయడం అభివృద్ధి చేయడంలో సహాయ పడతాయని పేర్కొన్నారు.
వ్యూహాత్మక భాగస్వామిగా తెలంగాణ ప్రభుత్వంతో నిమగ్నం కావాలనే ఆసక్తిని కనబరిచారు రోసీ గ్లేజ్ బ్రూక్.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఏర్పాటు చేయబోయే ఆర్ఆర్ఆర్, యంగ్ స్పోర్ట్స్ యూనివర్శిటీ, మూసీ నది అభివృద్ది గురించి బ్రూక్ కు తెలిపారు.
ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలను హైలైట్ చేస్తూ ముఖ్యమంత్రి తన దార్శనికతను పంచుకున్నారు.