సీఎంను కలిసిన ఎమ్మెల్సీలు
అభినందించిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – గవర్నర్ కోటాలో ఎంపికైన ప్రొఫెసర్ కోదండ రామి రెడ్డి , సియాసత్ ఎడిటర్ మీర్ అమీర్ అలీ ఖాన్ లు మర్యాద పూర్వకంగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా తమకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చినందుకు ఎనుముల రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు కోదండరాం, మీర్ ఖాన్. తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు కోదండరాం. ఆయన రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక వహించారు. అన్ని పార్టీలను, ప్రజా సంఘాలను ఒకే చోటుకు చేర్చడంలో సక్సెస్ అయ్యారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కోదంరాంకు ఉన్నతమైన పదవి దక్కుతుందని భావించారు. కానీ ఊహించని రీతిలో ఆయనను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. ఆ తర్వాత కేసీఆర్ కు ఊహించని రీతిలో షాక్ తగిలింది. ఆయన పదవి నుంచి దిగి పోయారు. బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి అయ్యాక కీలక వ్యాఖ్యలు చేశారు. కోదండరాంకు ఎమ్మెల్సీ ఇస్తామని ప్రకటించారు. ఆ మేరకు పార్టీ కూడా ఖరారు చేసింది.