సీఎంను కలిసిన సలహాదారులు
అభినందించిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – కొత్తగా నియమితులైన ప్రభుత్వ సలహాదారులు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, వేణుగోపాల్ రావు , షబ్బీర్ అలీలు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా వారు ఆయనను శాలువాలతో సత్కరించారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో రేవంత్ రెడ్డితో పాటు ఐటీ కార్యదర్శి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా స్విట్జర్లాండ్ లోని దావోస్ పర్యటనకు వెళ్లారు. అక్కడ మూడు రోజుల పాటు పర్యటించారు. 200 కంపెనీలతో చర్చించారు. రూ.40 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేలా చేశారు.
అక్కడి నుంచి నేరుగా లండన్ లో పర్యటించారు. అక్కడ మూడు రోజుల పాటు ఉన్నారు. చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించారు. మూసీ నది ప్రక్షాళన, అభివృద్ది గురించి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇదే సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని కూడా కలుసుకున్నారు. వీరిద్దరూ కలిసి లండన్ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.
ఆ తర్వాత దుబాయ్ కు చేరుకున్నారు. ఇక్కడ కూడా చర్చలు జరిపారు. ఆయన విదేశీ టూర్ లో ఉన్న సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా మల్లు రవి, షబ్బీర్ , వేణు గోపాల్ , నరేందర్ రెడ్డిలను నియమించారు.