సీఎం ఆదేశం కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం
నియామక పత్రం అందజేసిన సీపీ సుధీర్ బాబు
హైదరాబాద్ – గతంలో కొలువు తీరిన ప్రభుత్వ హయాంలో విధి నిర్వహణలో కానిస్టేబుల్ ఒకరు మరణించారు. తన భర్త చని పోవడంతో ఆ కుటుంబం పోషణ భారంగా మారింది. ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించు కోలేదని బాధితురాలు వాపోయింది.
ఇటీవలే బీఆర్ఎస్ సర్కార్ కూలి పోయింది. ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ సందర్బంగా ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రజా దర్బార్ లో మరోసారి బాధితురాలు సీఎంను కలిసి విన్నవించింది. తనకు న్యాయం చేయాలని, తనకు బతికేందుకు ఆదెరువు చూపించాలని కోరింది.
దీనిపై వెంటనే స్పందించారు ఎనుముల రేవంత్ రెడ్డి. ఆ వెంటనే పోలీస్ శాఖను ఆదేశించారు. కానిస్టేబుల్ భార్యకు వెంటనే ఉద్యోగం ఇవ్వాలని స్పష్టం చేశారు. దీంతో సీపీ సుధీర్ బాబు బాధితురాలికి జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వుల కాపీని అందజేశారు.
ఈ సందర్బంగా దివంగత కానిస్టేబుల్ భార్య సీఎం రేవంత్ రెడ్డికి, తనకు ఛాన్స్ ఇచ్చిన పోలీస్ శాఖకు, సీపీ సుధీర్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు.