సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు
నాలుగోసారి జారీ చేసిన దర్యాప్తు సంస్థ
న్యూఢిల్లీ – ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది.
మరో వైపు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా నోటీసులు జారీ చేసింది. సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈడీ ముందు హాజరు కావాలని కోరింది. ఢిల్లీలో హాజరైన తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
తాజాగా ఢిల్లీ మద్యం కుంభకోణంకు సంబంధించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో తనకు కూడా పాత్ర ఉందంటూ ఆరోపించింది దర్యాప్తు సంస్థ. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అరవింద్ కేజ్రీవాల్.
కేంద్రంలో కొలువు తీరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ సంకీర్ణ సర్కార్ కావాలని తనను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడ లేదని తెలిపారు.
ఇదే ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఇప్పటి వరకు మూడుసార్లు విచారణకు సంబంధించి నోటీసులు జారీ చేసింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). ఇప్పటి వరకు వీటికి ఇంకా సమాధానం ఇవ్వలేదని ఆరోపించింది. నాలుగోసారి ఈడీ తిరిగి కేజ్రీవాల్ కు నోటీసు జారీ చేసింది.