సీఎం దుబాయ్ టూర్ సక్సెస్
మూసీ నది ప్రాజెక్టుపై ఆరా
దుబాయ్ – సీఎం రేవంత్ రెడ్డి విదేశీ ప్రయాణం విజయవంతంగా ముగిసింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా స్విస్ లోని దుబాయ్ కి చేరుకున్నారు. అక్కడ 200 కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. మూడు రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఆయన చేసిన ప్రయత్నం ఫలించింది. 40,000 కోట్ల మేర పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం అభినందనీయం.
అక్కడి నుంచి నేరుగా లండన్ కు వెళ్లారు. అక్కడ ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు. తెలంగాణకు చెందిన వారు భారీగా స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తమ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఎర్ర తివాచీ పరుస్తుందని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
లండన్ లో ప్రముఖ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్బంగా తెలంగాణలో మూసీ నదిపై ప్రాజెక్టు నిర్మించాలనే దానిపై ఫోకస్ పెట్టారు. తాజాగా దుబాయ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఇదే సమయంలో దుబాయ్ వాటర్ ఫ్రంట్ ను స్వయంగా పరిశీలించారు. అక్కడ ఎలా పనులు చేపట్టారనే దానిపై ఫోకస్ పెట్టారు. ఈ సందర్బంగా తమ వద్దకు రావాలని కోరారు.