సీఎం షిండేతో మైనంపల్లి భేటీ
కీలక అంశాలపై చర్చించిన ఎమ్మెల్యే
ముంబై – తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నాయకుడు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చర్చనీయాంశంగా మారారు. ఆదివారం ఆయన మర్యాద పూర్వకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేను తన నివాసంలో కలుసుకున్నారు. బీజేపీ మద్దతుతో శివసేన పార్టీ మరాఠాలో కొలువు తీరింది సంకీర్ణ ప్రభుత్వం.
ఈ సందర్భంగా సీఎం నూతనంగా ఎమ్మెల్యేగా గెలుపొందిన మైనంపల్లి రోహిత్ ను ప్రత్యేకంగా అభినందించారు షిండే. మీలాంటి యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలు అత్యంత పోటీతత్వంతో , పెను సవాళ్లతో కూడుకున్నవి అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఏక్ నాథ్ షిండే కింది స్థాయి నుంచి సీఎం పదవి వరకు ఎదిగారు. విచిత్రం ఏమిటంటే ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా తండ్రీ కొడుకులు మైనంపల్లి హనుమంత రావు, మైనంపల్లి రోహిత్ బరిలోకి దిగారు. తండ్రి హనుమంత రావు ఓటమి పాలు కాగా కొడుకు రోహిత్ గ్రాండ్ విక్టరీని నమోదు చేశారు.
ఒకవేళ మైనంపల్లి గెలిచి ఉంటే ప్రస్తుత మంత్రివర్గంలో కీలకమైన శాఖలో కొలువు తీరి ఉండేవారు. ఆయన రాజకీయాల్లోకి రాక ముందు అమెరికాలో ఉన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడంలో కీలక పాత్ర పోషించారు.