సీట్ల ఖరారుపై బాబు కసరత్తు
అత్యధిక స్థానాలు కోరుతున్న జనసేన
అమరావతి – ఏపీలో రాజకీయాలు మరింత రంజుగా మారాయి. ఓ వైపు వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా ప్రమాణ స్వీకారం చేసింది. దీంతో నాలుగు స్తంభాలాటగా మారనుంది . అధికారంలో ఉన్న వైసీపీ మరోసారి జెండా ఎగుర వేయాలని కంకణం కట్టుకున్నారు ఆ పార్టీ బాస్ , సీఎం జగన్ రెడ్డి. ఇంకో వైపు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఈసారి జగన్ ను ఇంటికి పంపించాలని డిసైడ్ అయ్యారు ఆ పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు.
ఈ మేరకు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్నారు. ఇదే సమయంలో అటు జగన్ ను ఇటు చంద్రబాబును టార్గెట్ చేస్తూ ముందుకు వెళుతోంది భారతీయ జనతా పార్టీ. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ హై కమాండ్ అనూహ్యంగా దివంగత సీఎం నందమూరి తారక రామారావు కూతురు , మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కి పార్టీ బాధ్యతలు అప్పగించింది.
తాజాగా 175 సీట్లకు గాను ఇంకా టీడీపీ, జనసేన పార్టీల మధ్య పంచాయతీ ముగియలేదు. కనీసం 50 సీట్లు కావాలని పవన్ కోరుతున్నట్లు సమాచారం. మరో వైపు లోక్ సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇక ఉత్తరాంధ్రలో భీమిలి, దక్షిణం, పెందుర్తి , అనాకపల్లి అడుగుతోంది. అంతే కాకుండా శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చర్ల, పాతపట్నం, విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల, గజపతి నగరం సీట్లను కావాలంటోందట.