సురేష్ గోపి కూతురు పెళ్లికి మోదీ
ప్రధాని సమక్షంలో వివాహం
త్రిసూర్ – ప్రముఖ మలయాళ నటుడు సురేష్ గోపి కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకులకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈనెల 17న బుధవారం కేరళ లోని గురువాయూర్ ఆలయంలో సురేష్ గోపి తనయ పెళ్లి ఘనంగా జరిగింది. విచిత్రం ఏమిటంటే మోదీ సమక్షంలో ఈ పెళ్లి జరగడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
అంతకు ముందు గురువాయూర్ ఆలయంలో పూజలు చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇదిలా ఉండగా నటుడు సురేష్ గోపి మాజీ ఎంపీగా ఉన్నారు. ప్రత్యేకంగా గోపి తన కూతురు పెళ్లికి రావాలని పీఎంను కోరారు.
ఆయన కోరికను కాదనలేక పోయారు మోదీ. ఆ వెంటనే సమ్మతించారు. ఇవాళ ప్రధానమంత్రి నటుడి కూతురి పెళ్లిలో ప్రధాన ఆకర్షణగా మారారు. అంతకు ముందు గురువాయూర్ లోని శ్రీకృష్ణ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో దిగారు.
సురేష్ పెద్ద కూతురు భాగ్య సురేష్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తన భార్య రాధిక, కూతురుతో కలిసి అంతకు ముందు పెళ్లి పత్రిక ప్రధానమంత్రికి అందజేశారు.