సౌదీ ప్రిన్స్ తో దుద్దిళ్ల భేటీ
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి
సౌదీ అరేబియా – రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ విదేశీ పర్యటన చేపట్టారు. ఈ టూర్ అరబ్ దేశాలలో పర్యటించడంతో పూర్తయింది.
ముందుగా ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు. అక్కడి నుంచి నేరుగా స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు.
మొత్తం 200కు పైగా కంపెనీలతో సంభాషించారు. 40,000 వేల కోట్లకు పైగా పెట్టుబడులను సాధించారు. ఆయా కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా లండన్ కు చేరుకున్నారు. మూడు రోజుల పాటు పర్యటించారు.
అనంతరం దుబాయ్ కి చేరుకున్నారు. దిగ్గజ కంపెనీలతో చర్చించారు. సౌదీ అరేబియా లోని జెడ్డాలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలకమైన వ్యక్తులతో భేటీ అయ్యారు. ప్రత్యేక కార్యాలయం ప్రిన్స్ , జనరల్ డైరెక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా రేస్ తో సమావేశం అయ్యారు.
తొలి మీటింగ్ లో తెలంగాణ పరిశ్రమకు అనుకూలమైన వాతావరణం, ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని దుద్దిళ్ల ప్రిన్స్ , జేడీతో కోరారు.