స్టార్ డైరెక్టర్ కు బంపర్ ఆఫర్
అటు వైసీపీ ఇటు టీడీపీ
అమరావతి – అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు వివి వినాయక్. తను ఈ మధ్య కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. అయితే ఉన్నట్టుండి ఏపీలో కొలువు తీరిన వైసీపీ ప్రధానంగా వినాయక్ పై దృష్టి సారించింది. తనకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఛాన్స్ ఇచ్చింది. ఈ మేరకు పార్టీ నుంచి కూడా వినాయక్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది.
ఏకంగా ఆయనకు ప్రస్తుతం జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరింది. ఈ మేరకు సీటు కూడా ఖరారు చేసింది. ఏపీలోని కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇదే సమయంలో నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ కూడా వినాయక్ ను సంప్రదించినట్టు సమాచారం.
తమ పార్టీ తరపున పోటీ చేయాలని, ఏ సీటు కావాలన్నా ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో డైరెక్టర్ వివి వినాయక్ పునరాలోచనలో పడ్డారని సినీ, రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో వైపు సినీ రంగానికి చెందిన పోసాని కృష్ణ మురళికి చైర్మన్ పోస్టును కట్టబెట్టారు జగన్ మోహన్ రెడ్డి. తాజాగా మరో నటుడు అలీకి ఎంపీ సీటు కేటాయించేందుకు మొగ్గు చూపుతున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.