హనుమాన్ డైరెక్టర్ రాముడికి విరాళం
రూ. 14 లక్షలు ప్రకటించిన ప్రశాంత్ వర్మ
ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలైన ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ చిత్రం భారీ వసూళ్లతో దూసుకు పోతోంది. థియేటర్లు లేక పోయినా మెల మెల్లగా ఇటు టాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా ఆదరణ చూరగొంటోంది. ఇదే సమయంలో ఓవర్సీస్ లో కూడా బిగ్ సక్సెస్ అయ్యింది.
విచిత్రం ఏమిటంటే ఇండియన్ ఫేమస్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం చిత్రం ప్లాప్ అయ్యింది. థియేటర్లు లేకుండా ఇబ్బందులకు గురి చేసిన వాళ్లే ఆ సినిమాను తీసేసి ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీని వేస్తుండడం విశేషం. ఇప్పటికే విడుదలైన అన్ని చోట్లా బాక్సులు బద్దలు కొడుతోంది ఈ చిత్రం.
తాజాగా సినీ దర్శకుడు ప్రశాంత్ వర్మ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతానికి వచ్చిన దాంట్లో రూ. 14 లక్షల రూపాయలు అయోధ్య లోని రామ మందిరం ట్రస్టుకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి టికెట్ నుండి రూ. 5 రూపాయల విరాళం ఇస్తామన్నారు.
సినిమా ఆడినా ఆడక పోయినా రాముడికి విరాళం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోందన్నారు. ఆదరిస్తున్న అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు దర్శకుడు.