హనుమాన్ సెన్సేషన్
మూవీ కలెక్షన్ల వేట
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సంక్రాంతి పండుగ సందర్బంగా విడుదలైన తెలుగు చిత్రం హనుమాన్ దుమ్ము రేపుతోంది. కలెక్షన్ల వేట కొనసాగిస్తోంది. ఓవర్సీస్ లో సైతం కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తోంది. స్టార్ హీరోలను తలదన్నేలా సక్సెస్ టాక్ తెచ్చుకుంది.
రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ. 100 కోట్ల మార్క్ ను దాటింది హనుమాన్. ఈనెల 22న అయోధ్య లోని శ్రీరాముడి పునః ప్రతిష్ట కార్యక్రమం ఉండడంతో ఈ చిత్రాన్ని భారీగా ఆదరిస్తున్నారు. ఈనెల 12న రూ. 21.35 కోట్లు వసూలు చేసింది. 13న రూ. 29.72 కోట్లు , 14న 24.16 కోట్లు, 15న 25.63 కోట్లు కలెక్షన్లు సాధించింది. ఇప్పటి వరకు మొత్తంగా రూ. 100.86 కోట్లు సాధించింది.
దేశ వ్యాప్తంగా పలు భాషల్లో హనుమాన్ విడుదలైంది. ప్రతి చోటా జై హనుమాన్ అన్న నినాదాలు మిన్నంటాయి. ఈ చిత్రానికి పోటీగా పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం ఆశించిన మేర ఆడలేదు. పూర్తిగా నెగటివ్ టాక్ తెచ్చుకుంది.
చాలా థియేటర్లలో ఆ సినిమాను తీసేసి ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ ను వేస్తున్నారు.