NEWSTELANGANA

హ‌నుమాన్ హీరోకు అభినంద‌న

Share it with your family & friends

స‌న్మానించిన జి. కిష‌న్ రెడ్డి

హైద‌రాబాద్ – ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన హ‌నుమాన్ చిత్రం అద్బుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. స్టార్ హీరోల సినిమాల‌ను త‌ల‌ద‌న్ని టాప్ లో నిలిచింది. ఇంకా ఈ మూవీని జ‌నం ఆద‌రిస్తున్నారు. త‌మ‌దిగా భావిస్తున్నారు. అక్కున చేర్చుకుంటున్నారు.

సంక్రాంతి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా జ‌న‌వ‌రి 12న ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌ర్మ తీసిన హ‌నుమాన్ చిత్రం విడుద‌లైంది. ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ సాధించింది. ఆట ప్రారంభం నుంచే అదుర్స్ అనిపించేలా క‌ల‌క్షెన్ల వ‌ర్షం కురిసింది. ఎక్క‌డ చూసినా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సులు కాసుల‌తో నిండి పోయాయి.

హ‌నుమాన్ సినిమాలో జై హ‌నుమాన్ జై శ్రీ‌రామ్ నినాదాల‌తో థియేట‌ర్ల‌న్నీ హోరెత్తి పోయాయి. త‌క్కువ బ‌డ్జెట్ తో ద‌ర్శ‌కుడు కొత్త హీరో తేజా స‌జ్జాతో చేసిన ప్ర‌యోగం ఫ‌లించింది. త‌ల‌ద‌న్నే గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేశాడు ద‌ర్శ‌కుడు. ఇదే స‌మ‌యంలో అయోధ్య లోని రామ మందిరానికి సినిమా టికెట్ పై రూ. 5 రూపాయ‌లు విరాళంగా ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు చిత్ర యూనిట్.

దీంతో దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఈ సంద‌ర్బంగా కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి హ‌నుమాన్ చిత్రాన్ని కొనియాడారు. ఈ మేర‌కు న‌టుడు తేజా స‌జ్జాను శాలువాతో స‌త్క‌రించి అభినందించారు.