హస్తం..కమలం ఒక్కటే – కేటీఆర్
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హస్తం..కమలం పార్టీలు ఒక్కటేనని, ఆ రెండు పార్టీలది ఫెవికాల్ బంధమన్నారు. శనివారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు.
రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నం చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. హస్తంకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని అన్నారు. ఆ రెండు పార్టీలు లోపాయికారి అవగాహన కలిగి ఉన్నాయని పేర్కొన్నారు.
ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి అదానీని తిట్టాడని, సీఎం అయ్యాకు దావోస్ లో దోస్తులుగా మారి పోయారని ఆరోపించారు కేటీఆర్. ఇలాంటి చిల్లర రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు . ప్రజలు ఇక కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూరేలా చేసిందంటూ ఆరోపించారు. గవర్నర్ గా ఉన్న తమిళి సై రాజ్యాంగ బద్దంగా వ్యవహరించడం లేదని, ఆమె ఫక్తు బీజేపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. దాసోజు శ్రవణ్ ను తిరస్కరించిన గవర్నర్ ఎందుకని కోదండరామ్ కు ఓకే చెప్పారో ప్రజలకు తెలియ చేయాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్