హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌పై ఏసీబీ దాడి
టౌన్ ప్లానింగ్ అధికారులలో టెన్షన్ టెన్షన్
హైదరాబాద్ – హైదరాబాద్ నగర పాలక సంస్థలో కీలకమైన పాత్ర పోషించిన మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంటిపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. బుధవారం మూకుమ్మడిగా దాడులకు పాల్పడింది. నగరంలోని పలు చోట్ల సోదాలు చేపట్టింది.
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది. హైదరాబాద్ లోని 20 ప్రాంతాలలో దాడులు చేపట్టింది. శివ బాలకృష్ణ నివాసంతో పాటు బంధువుల ఇళ్లలోనూ జల్లెడ పడుతోంది. ఈ సోదాలు ఇంకా రేపటి తెల్లవారు జాము వరకు కొనసాగే ఛాన్స్ ఉందని సమాచారం.
శివ బాలకృష్ణ గతంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఐటీ, పురపాలిక శాఖా మంత్రిగా ఉన్న కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఇదే సమయంలో ప్రస్తుతం ఆయన మాజీ డైరెక్టర్ గా ఉన్నా మెట్రో లో జనరల్ మేనేజర్ గా పని చేస్తున్నారు.
శివ బాలకృష్ణ ఇల్లు, ఆఫీసులను ఏసీబీ బృందాలు జల్లెడ పడుతున్నాయి. పదవిని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు సంపాదించినట్లు ఏసీబీ గుర్తించింది. హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పని చేశారు.