అన్నదానం జన్మ ధన్యం
300 మందికి ప్రతి రోజూ ప్రసాదం
తిరుపతి – అన్నమయ్య ప్వూర్ వెజ్ విల్ విష్ ఫెసిలిటీ ప్రైవేట్ లిమిటిడెడ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో భక్తులకు ప్రతి రోజూ అన్నదానం నిర్వహించనుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఉగాది రోజు వేంకటేశ్వరుని పాదాల చెంత తిరుపతి లీలా మహల్ సెంటర్ వద్ద అన్నమయ్య ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయనున్నారు.
ప్రతి రోజూ స్వామి వారి దర్శనం కోసం వచ్చే 300 మంది భక్తులకు ఉచితంగా అన్నదానం చేస్తామని పేర్కొంది. రోజు రోజుకు 1,000 మందికి పైగా అన్న ప్రసాదం అందివ్వాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. అన్నదానం చేయాలని అనుకున్న దాతలు ఒక్కొక్కరికీ రూ. 105 చొప్పున ఎంత మందికి పెట్టాలని అనుకుంటే అన్ని డబ్బులను జమ చేయొచ్చని తెలిపింది.
పుట్టిన రోజు లేదా పెద్దలను స్మరించు కునేందుకు కనీసం రూ. 1260 రూపాయలు 12 మందికి 12 కూపన్లు కొనుగోలు చేయాలని సూచించింది. స్వామి వారికి విశిష్ట రోజులైన బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశిన , సమయానుకూలంగా అన్నదానం చేస్తామని తెలిపింది. దాతలు ఈ కింది వాటి ద్వారా సాయం చేయాలని కోరింది. https://tinyurl.com/apvsubhyatrareg. లేదా హైదరాబాద్ లోని తమ సంస్థకు సంబంధించి వివరాలు కావాలంటే ఈ నెంబర్లలో 9515100411,994918441 సంప్రదించాలని కోరింది.