అమెరికాలో టెస్లా సైబర్ ట్రక్ నెంబర్ వన్
అత్యధికంగా అమ్ముడైన వాటిలో టాప్
అమెరికా – ప్రపంచంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న ఏకైక వ్యాపారవేత్త , టెస్లా చైర్మన్, ట్విట్టర్ సీఈవో, ఎండీ ఎలోన్ మస్క్. తను ఏది చేసినా అది ఓ సంచలనమే. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా మరోసారి చర్చనీయాంశంగా మారాడు ఎలోన్ మస్క్. ఇందుకు ప్రధాన కారణం తను ఎక్కడ ఉన్నా నెంబర్ వన్ గా ఉండాలని అనుకుంటాడు. లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా, లెక్కించ లేనంత డబ్బులు కూడ బెట్టినా కేవలం చిన్న అపార్ట్ మెంట్ లో ఉండడం తన సింప్లిసిటీకి నిదర్శనం.
ఇదిలా ఉండగా లేటెస్ట్ టెక్నాలజీతో అద్భుతమైన డిజైన్లతో కార్ల తయారీలో , ప్రత్యేకించి ఎలక్ట్రిక్ సహకారంతో నడిచే వాటిని మార్కెట్ లోకి తీసుకు వచ్చాడు. ఇప్పుడు టెస్లా కార్లకు పెద్ద ఎత్తున మార్కెట్ లో డిమాండ్ ఉంటోంది. ఒకవేళ వాటిని కొనుగోలు చేయాలంటే నిరీక్షించక తప్పదు. అంతగా వరల్డ్ వైడ్ గా గిరాకీ ఏర్పడింది.
ఇదిలా ఉండగా తాజాగా టెస్లా కంపెనీ నుంచి విడుదల చేసిన టెస్లా కు చెందిన సైబర్ ట్రక్ క్యూ 3 దుమ్ము రేపుతోంది. ఈ ఏడాది 2024లో అమెరికాలో అత్యధికంగా అమ్ముడు పోయిన మూడో ఈవీ గా పేరు తెచ్చుకుంది. కాక్స్ ఆటోమోటివ్ డేటా ప్రకారం సైబర్ ట్రక్ ఫోర్డ్ ఎఫ్ -150 లైట్నింగ్ కంటే 2.3 రెట్లు ఎక్కువ కార్లను విక్రయించడం విశేషం.