అయోధ్యలో భారీ బందోబస్తు
రేపే శ్రీరాముడి పునః ప్రతిష్ట
ఉత్తర ప్రదేశ్ – దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న అయోధ్య లోని రామ మందిరం పునః ప్రారంభోత్సవ కార్యక్రమం జనవరి 22న సోమవారం జరగనుంది. ఈ సందర్బంగా లక్షలాది మంది హిందూ భక్తులు , ప్రముఖులు ఈ పవిత్ర పుణ్య క్షేత్రానికి తరలి వెళ్లనున్నారు. దీంతో భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసింది యూపీ సర్కార్.
సీఎం యోగి ఆదిత్యానాథ్ సారథ్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఏఐ టెక్నాలజీ సహాయంతో పర్యేవక్షణ జరుగుతోంది. చీమ చిటుక్కుమన్నా తెలుసుకునేలా చేస్తోంది ప్రభుత్వం.
ఇక ప్రచురణ, ప్రసార, డిజిటల్ మీడియా సైతం 24 గంటల పాటు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నాయి. గూగుల్ సంస్థకు చెందిన యూట్యూబ్ పై చూసేందుకు కోట్లాది మంది నిరీక్షిస్తున్నారు. మొత్తంగా అయోధ్య నగరం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నగరంలో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు.
కేంద్ర బలగాలు మోహరించాయి. అయోధ్య రామ మందిరం ప్రాంతం నుండి చుట్టూ 6 కిలోమీటర్ల పొడవునా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాల రాక పోకలకు అనుమతి నిరాకరించారు. స్థానిక నివాసులకు, పాసులు ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు. రేపు మరిన్ని ఆంక్షలు విధించనున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది.