అవార్డు వచ్చినా స్పందించని సర్కార్
నిప్పులు చెరిగిన తన్నీరు హరీశ్ రావు
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీల పేరుతో జనాన్ని బురిడీ కొట్టించారంటూ ఆరోపించారు. ఇదే సమయంలో దేశంలోని మున్సిపాలిటీలలో సిద్దిపేట 9వ ర్యాంకు సాధించిందని, దక్షిణ భారత దేశంలో తొలి స్థానంలో నిలిచిందని అన్నారు.
ఈ స్థాయిలో సిద్దిపేట అవార్డు పొందినా ప్రస్తుత సర్కార్ స్పందించక పోవడం దారుణమన్నారు. అభివృద్దిని చూసి ఓర్వలేని నైజం ఉన్న వాళ్లు కాంగ్రెస్ నాయకులంటూ ఆరోపించారు తన్నీరు హరీశ్ రావు.
ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇలాంటి ధోరణిని ఎవరైనా సరే ఖండించాల్సిందేనని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో తమ హయాంలోనే తెలంగాణను టాప్ లో నిలిచేలా చేశామని స్పష్టం చేశారు.
ఐటీ , ఫార్మా, లాజిస్టిక్ పరంగా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటైన విషయం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు గమనించాలని సూచించారు. ఇకనైనా అభివృద్దిని గుర్తించి ప్రోత్సహించేందుకు ప్రయత్నం చేయాలని కోరారు తన్నీరు హరీశ్ రావు.