ఆర్టీసీని బలోపేతం చేస్తాం
ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – కేసీఆర్ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆర్టీసి తీవ్రంగా నష్ట పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులను అమ్మే పనిలో పడ్డారే తప్పా ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న సంస్థను ఆదుకోవాలన్న కనీస బాధ్యతను మరిచి పోయారని మండిపడ్డారు.
శనివారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం మీడియా పాయింట్ వద్ద రేవంత్ రెడ్డి మాట్లాడారు. గతంలో ఏనాడూ ఆర్టీసీ సమస్యలను పరిష్కరించిన పాపాన పోలేదన్నారు. తాము వచ్చాక గాడిలో పెట్టామని చెప్పారు.
తాము తీసుకు వచ్చిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం బిగ్ సక్సెస్ అయ్యిందని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఇప్పటి వరకు ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 15 కోట్ల మంది ప్రయాణం చేశారని ఇది ఓ రికార్డ్ అని చెప్పారు రేవంత్ రెడ్డి.
రాష్ట్రంలో దేవాదాయ , ధర్మాదాయ శాఖకు గణనీయమైన రీతిలో ఆదాయం లభించిందన్నారు. తాము వచ్చిన వెంటనే ఆర్టీసీకి రూ. 500 కోట్లు విడుదల చేశామన్నారు. ప్రతి ఒక్కరికీ ఒకటో తారీఖునే జీతాలు ఇస్తున్నామని తెలిపారు.