ప్రకటించిన ఎండీ వీసీ సజ్జనార్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ సంచలన ప్రకటన చేశారు. ప్రయాణీకులకు శుభ వార్త చెప్పారు. బస్సుల్లో ఇక నుంచి చిల్లర సమస్యకు స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. సిటీ బస్సుల్లో క్యూ ఆర్ కోడ్ తో స్కానింగ్ సదుపాయం తీసుకు వచ్చామన్నారు. యూపీఐ పేమెంట్ ద్వారా టికెట్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ ద్వారా ఆర్టీసీ ఆన్‌లైన్ టికెటింగ్ కు శ్రీకారం చుట్టామన్నారు.
రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సులకు ఈ సౌకర్యాన్ని విస్తరించనున్నట్లు ప్రకటించారు ఎండీ. దేశంలోనే అత్యధిక ప్రయాణీకులు ప్రయాణించే సంస్థగా టీజీఎస్ఆర్టీసికి గుర్తింపు ఉంది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించింది. దీంతో బస్సులకు ప్రయాణీకుల రద్దీ పెరిగింది. రోజు రోజుకు టెక్నాలజీ మారుతుండడంతో సంస్థ పరంగా మరింత వెసులుబాటు కల్పించాలని చర్యలు తీసుకున్నామన్నారు ఎండీ.