NATIONALNEWS

ఇండియా కూట‌మి చీఫ్ గా ఖ‌ర్గే

Share it with your family & friends

అన్ని పార్టీలు ఆయ‌న వైపే

న్యూఢిల్లీ – దేశ రాజ‌కీయాల‌లో కీల‌క‌మైన పాత్ర పోషిస్తూ వ‌స్తున్నారు క‌ర్ణాట‌క‌కు చెందిన ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. భావ సారూప్య‌త క‌లిగిన అన్ని పార్టీల నేత‌ల‌తో స‌త్ సంబంధాల‌ను కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు. గ‌త కొన్ని రోజులుగా విప‌క్షాల‌న్నీ క‌లిసి ఇండియా కూట‌మిగా ఏర్ప‌డ్డాయి. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగింది.

ఎవ‌రు ఇండియా కూట‌మికి క‌న్వీన‌ర్ గా ఉండాల‌నే దానిపై . చివ‌ర‌కు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేనే స‌రైన వ్య‌క్తి అన్ని పార్టీల నేత‌లు ఒకే అభిప్రాయానికి వ‌చ్చారు. దీంతో శ‌నివారం కూట‌మి కీల‌క భేటీ జ‌రిగింది.

ఈ భేటీలో మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేను ఇండియా కూట‌మి అధ్య‌క్షుడిగా తాము ప్ర‌తిపాదిస్తున్న‌ట్లు తెలిపారు. ఇదే స‌మ‌యంలో అన్ని పార్టీల‌ను ఒకే వేదిక‌పైకి తీసుకు రావ‌డంలో గ‌త కొంత కాలంగా తీవ్ర‌మైన కృషి చేస్తూ వ‌చ్చారు బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్. ఆయ‌న‌ను కూట‌మికి క‌న్వీన‌ర్ గా నియ‌మించారు.

ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల జ‌రిగిన కూట‌మి కీల‌క స‌మావేశంలో టీఎంసీ చీఫ్ , ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేనే కూట‌మికి చీఫ్ గా ఉండాల‌ని ప్ర‌తిపాదించారు. కానీ ఆయ‌న ఒప్పుకోలేదు. చివ‌ర‌కు సోనియా, రాహుల్ సూచించ‌డంతో గ‌త్యంత‌రం లేక ఓకే చెప్పారు. ప్ర‌స్తుతం సీట్ల స‌ర్దుబాటుపై చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి.