NEWSTELANGANA

ఈడీ నోటీస్ డోంట్ కేర్

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన క‌విత‌

హైద‌రాబాద్ – దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న క‌లిగించిన ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో మ‌రోసారి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు. దీనిపై ఆమె తీవ్రంగా స్పందించారు. ప్ర‌స్తుతం ఇదే నోటీసుల‌కు సంబంధించి స‌ర్వోన్న‌త న్యాయ స్థానంలో కేసు న‌డుస్తోంద‌ని, దానిపై తుది తీర్పు వ‌చ్చేంత వ‌ర‌కు తాను ఈడీ నోటీసుకు స్పందించాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది క‌విత‌.

ఇవాళ మ‌రోసారి విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు లేఖ రాసింది క‌ల్వ‌కుంట్ల క‌విత‌. తాను విచార‌ణ‌కు హాజ‌రు కాలేనంటూ ఈ మెయిల్ ద్వారా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌కు తెలిపింది.

స‌ర్వోన్న‌త న్యాయ స్థానం త‌న పిటిష‌న్ పై విచార‌ణ చేప‌ట్టాక‌, అంతిమ తీర్పు వెలువ‌రించిన త‌ర్వాత‌నే తాను ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ ముందు హాజ‌ర‌వుతాన‌ని స్ప‌ష్టం చేసింది క‌ల్వ‌కుంట్ల క‌విత‌. త‌న‌కు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల ప‌ట్ల గౌర‌వం ఉందంటూనే మ‌రో వైపు తాను రాలేనంటూ పేర్కొన‌డం క‌ల‌క‌లం రేపింది.

ఇప్ప‌టికే ఇదే కేసుకు సంబంధించి ఆప్ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా జైలులో ఉన్నారు. మ‌రో వైపు
ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కు కూడా ఈడీ నోటీసులు ప‌లుమార్లు జారీ చేసింది. ఆయ‌న కూడా డుమ్మా కొట్టారు.