ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయను
మంత్రి ధర్మాన ప్రసాద్ రావు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాద రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను పోటీ చేసే స్థితిలో లేనని పేర్కొన్నారు. ఇక విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. తాను ఇప్పుడు రాజకీయాలు చేయలేనంటూ వాపోయారు.
ఇవాళ తాను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశానని అన్నారు. ఈ సందర్బంగా తాను పోటీ చేయలేనంటూ స్పష్టం చేశానని, కానీ అందుకు సీఎం ఒప్పుకోలేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఏపీలో కీలకమైన మంత్రిగా ఉన్నారు ధర్మాన ప్రసాదరావు.
ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. గతంలో ఉన్న రాజకీయాలు వేరని, కానీ ఇప్పుడున్న పాలిటిక్స్ చాలా భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈసారి ఎన్నికలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. చతుర్ముఖ పోటీ జరగనుంది.
ఏపీలో నాలుగు స్తంభాలట మొదలైందని, ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టమైన పని అని పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు.